దాశరధి( బాల గేయం):-యెల్లు. అనురాధ రాజేశ్వర్ రెడ్డితెలుగుభాషొపాధ్యాయులు సిద్దిపేట

దాశరథి దాశరథి దాశరథి
 దాశరథి దాశరథి దాశరథి

 తెలంగాణ విముక్తి కోసం
 ఉద్యమించిన దాశరథి 
నిజాం పాలన పైన 
నిప్పులు కురిపిన దాశరథి 
//దాశరథి//

 వరంగల్ గూడూరులో పుట్టి
 హైదరాబాదులో చదువులునేర్చి
 సంస్కృతంలో ప్రావీణ్యం పొంది
  ప్రజలందరి చైతన్యం కోసం
// దాశరథి//

ఉద్యమానికి ప్రేరణనిచ్చి
 విముక్తి కోసం ఉద్యమించేను
 పద్య ప్రక్రియె పదునైన ఆయుధం
 పీడిత ప్రజల గొంతుగమారెను
// దాశరథి//

 అగ్నిధార రుద్రవీణ
 నేత్ర పర్వం పునర్నవం
 తిమిరంతో సమరం
 రచనలు ఎన్నో చేశారు
// దాశరథి//


కామెంట్‌లు