జిడ్డు కృష్ణమూర్తి:-పిల్లి.హజరత్తయ్య---సింగరాయకొండజిల్లా: ప్రకాశం

51) తత్వాన్ని కొందరు బోధిస్తారు 
తత్వవేత్తగా కొందరు నిలబడతారు
జిడ్డు కృష్ణమూర్తి తత్వవేత
ఆయన గొప్ప రచయిత

52) మనసు కావాలి చైతన్యాలు 
మనిషిని ఆవహించిన నిస్తేజాలు
సూక్ష్మంలో మోక్షంలా బోధనలు
జిడ్డు కృష్ణమూర్తి తత్వాలు

53) హృదయంలో విప్లవం రావాలి
నీలో పరివర్తన కలగాలి
జీవనానికి అనుగుణంగా ప్రసంగాలు 
ఆధ్యాత్మిక విషయాలపై ఉక్తానాలు

54) బాహ్య మార్పులులు ఆశాశ్వితాలు
నీలో మార్పు శాశ్వతాలు
తనదైన శైలి అలవర్చుకున్నారు
జిడ్డు కృష్ణమూర్తి గారు

55) సంతోషం భలే విచిత్రమైంది
దానంతట అదే లభిస్తుంది
కోరితే రాదు సంతోషం
కోరుకోకపోతే వస్తుంది సంతోషం

56) సమస్యలోనే సమాధానం ఉంటుంది
ఏకాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది
సమస్యను నిజంగా అర్థంచేసుకో
స్వచ్ఛంగాఉండటమే ఏకాంతమని తెలుసుకో

57) అసలు దేనికీ భయపడనివాడు
స్వతంత్ర వ్యక్తిలా జీవిస్తాడు
భయంలేనివాడిలో క్రోధం ఉండదు
అతనిలో దౌర్జన్యం ఉండదు

58) వినడం అనేది సంపూర్ణమైంది
దానిలోనే స్వేచ్ఛ ఉంది
భవిష్యత్తులో జరిగేది పట్టించుకోకు
ప్రస్తుతం జరిగేది మరువకు

59) ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి
ఏదీశాశ్వతం కాదని గ్రహించాలి
జీవితానికి మనసే మూలము
స్వేచ్ఛగా జీవించడమే ఆనందము

60) అంతులేని ప్రక్రియ నేర్చుకోవడమనేది
అసలైన విప్లవం జరగవలసినది
నేర్చుకోవాలంటే మనసుండాలి
చూడాలంటే స్పష్టత కావాలి