ఆషాఢ బోనాలు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
ఆషాఢ మాసంలో
అమ్మోరి పండుగలు
గడప గడప బోనాలు
ఇలవెలుపు కొల్పులు

దప్పుల్ల చప్పుడు 
ధరువుల మోతలు
మంగళహారతులు
పల్లె పట్నంలో పండుగ

పసుపు కుంకుమలతో
రంగయిన పట్నాలు
ఏడంతస్తుల బోనం
ఎత్తి తీర్చే మొక్కలు

శివమెత్తిన శివసత్తులు
వేపాకు రెమ్మల్లో మాలలు
పోతరాజుల ఆటపాటలు
మేకపోతుల గావులు

పోలిజల్లే గంపలు
పొలిమేరలో దిగ్బంధం
గ్రామ దేవతల పండుగ
మా ఊరి బొనాల పండుగ