జీవన రాగం .. !! (ఆన్షి లు ):-డా . కె . ఎల్ . వి . ప్రసాద్ ,హన్మకొండ .
ఆరోగ్యప్రదాయిని మన నడక సోదరా 
నడకలోనే వుంది నిజమైన మహత్తు !
నడక జీవితమంతానడచిన కలుగుమేలు,
వినుము,కె.ఎల్వీ .మాట నిజముసుమ్ము!!

మనిషికి ఆరోగ్యము మంచి నడకలో వుంది 
వళ్ళు కదిలిచక్కగావ్యాయామము చేసినట్టు
ఉత్సాహముగా మనిషి చక్కగాఉరకలెత్తు గదా!
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

బద్దకం మనిషిని త్వరగా వృద్ధుడిని చేయు .. 
నడక అశ్రద్దచేసి  అనారోగ్యము పాలౌదురు!
ఆరోగ్యమే మహఃభాగ్యమని  మరువనేల …. 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

తెల్లవారగానే బద్దకం వద లి  నిద్రలేవాలి ..  
కాలకృత్యములు తీర్చుకుని కదలాలి బయటికి 
గంటసేపైనా మంచిగా నడచిన చెమట రావాలి 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

ఇంటి మిద్దెమీద కొద్దికొద్దిగా నడచి కొందరు 
అదే ఘనకార్యమన్నట్టు గొప్పలు పోదురు !
విశాలమైన ఆటస్థలములు నడకకు నెలవులు 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

సూర్యుడుదయించు వేళ నడకకు మంచిది 
ఉచితముగా’ డి - విటమిను ‘ పొందువేళ యది !
వినియోగించుకోవాలి ప్రక్రుతి అందించు మేళ్లు …. 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము … !!

నలుగురూ నడుచు చోటు ఎంచుకొనుట మంచిది 
ఒకరి నడకచూచిన మరొకరికి ఉత్ప్రేరకంగా నిలుచు!
నడక తెలిసిన వానిని అనుసరించుట మేలు కదా ,
వినుము

కేఎల్వీ మాట నిజము సుమ్ము … !!

గుండెజబ్బులు ఇతర మధుమే హా వ్యాధులు .. 
నడక నడుచువానికి భయపడి పారిపోవు .. !
విషయ అవగాహన లేక ప్రాణాలు కోల్పోదురు 
వినుము కేఎల్వీ మాట నిజము సుమ్ము .. !!

                 

కామెంట్‌లు