*కన్యక* (కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(ఐదవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 17)
పెండ్లి జేయును అగ్నిసాక్షిగ
పెండ్లి అగును దుర్గమ్మసాక్షిగ
అంతా కలిసి కదిలిరి
దుర్గమ్మ గుడికి చేరిరి!
18)
గుడిలో దుర్గను భక్తితొకొలిచి
ముక్తిని కోరుతూ నగలనుఒలిచి
మండే హోమగుండంలో వేసింది
తనస్థితిని తలచి యోచన చేసింది!
19)
పట్నము ఏలే రాజువునీవు
దురాచారాలు చేసే బూజువునీవు
ధైర్యముంటే నన్నిపుడు పట్టుకో
శక్తిఉంటే మంటల్లో నన్నుచుట్టుకో!
20)
అనినకన్యక హోమగుండాన దుమికింది
అక్కడున్న జనమంతా వణికింది
అదిచూసిన రాజుగర్వం మట్టిలో
కలిసింది రాజుగౌరవం మంటలో!!!
(సమాప్తము)