కోడలు కూతురు లాంటిదే.:-- తాటి కోల పద్మావతి గుంటూరు.


 సుధాకర్ ఉద్యోగం వచ్చాక తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు.

తల్లిదండ్రులకు చెప్పకుండా చేసుకున్నాడని పెళ్లి కి వచ్చే కట్నకానుకలు రాలేదని వచ్చిన కోడలు నచ్చలేదు రాజ్యలక్ష్మికి.

పెళ్లి అయిపోయాక మనం చేసేదేముంది కాదంటే వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోతారు మన పరువే పోతుంది. వాడి ఇష్ట పడిన అమ్మాయిని చేసుకున్నాడు. మన గౌరవం మనం కాపాడుకోవాలి వాళ్ళని ఆశీర్వదించి లోపలకి వెళ్ళమన్నాడు మాధవరావు. తండ్రికి తల్లికి ఇద్దరు పాదాభివందనం చేశారు. సుధాకర్ భార్యని లోపలకి తీసుకు వెళ్ళాడు. నాలుగు రోజులు పోతే మా అమ్మ సర్దుకు పోతుంది నువ్వేమి అధైర్య పడవద్దని భార్యకి అభయమిచ్చాడు. సుధాకర్ ఆఫీస్ కి వెళ్లిపోయాక ఉదయం ఇంటి పనులలో అత్తగారికి సాయపడాలని వచ్చింది స్రవంతి. కోడలిని ఏ పని ముట్టుకో నివ్వదు మన కులం కాని అమ్మాయి ఇల్లంతా తిరగటం ఇంటి పనులు చేయటం ఆమెకు నచ్చలేదు. మడిగట్టుకొని వంట చేసి భర్తకి వడ్డించేది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత మిగిలిన గిన్నెల అన్ని టేబుల్ మీద పెట్టి ఉంచేది. మధ్యాహ్నం సుధాకర్ భోజనానికి వచ్చినప్పుడు స్రవంతి వడ్డించేది ఇద్దరూ కలిసి తినే వాళ్ళు. నెల రోజులు దాటినా అత్తగారికి కోడలు మీద కోపం పోలేదు. మాట లేదు మంచి లేదు. స్రవంతి తన గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడేది. చీటికీ మాటికీ సూటిపోటి మాటలు అనడం కట్నకానుకలు తేలేదని రుసరుసలు ఆడటం దరిద్రపుగొట్టు సంబంధం చేసుకున్నాడని సాధించేది. మేము చూసిన అమ్మాయిని చేసుకుంటే బాగుండేది. అడిగినంత కట్నం విచ్చే వాళ్లు. ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది అంటూ దెప్పి పొడుపులు మానుకోలేదు రాజ్యలక్ష్మి. స్రవంతి అన్నిటినీ మౌనంగానే భరిస్తూ వస్తున్నది. మాధవ రావు గారే ఆ పిల్ల మీద జాలి చూపించేవారు. కొన్నాళ్లు ఓపిక పట్ట మన్నారు. భర్త సుధాకర్ వల్ల ఆమెకి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో సర్దుకుపోతూ ఉన్నది. ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూం లో నుంచి కేకలు వినిపించాయి. రాజలక్ష్మి మీ కింద పడి పోయి లేవలేక అరుస్తున్నది. వెంటనే స్రవంతి పరిగెత్తుకుంటూ వెళ్లి మామగారి సాయంతో ఆమెని బయటికి తీసుకు వచ్చింది. కదలలేని పరిస్థితిలో ఉన్నది రాజ్యలక్ష్మి. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. పరీక్షలన్నీ చేశాక నడుము కింద వెన్నెముక కి దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలన్నారు. స్రవంతి సుధాకర్ కి ఫోన్ చేసింది. ఆపరేషన్ చేయించారు మూడు నెలలు రెస్ట్ కావాలి అన్నారు దిగకూడదు. మంచం దగ్గరికే భోజనం తెచ్చిపెట్టేది కోడలు. ఇష్టం లేకపోయినా తినటం తప్ప లేదు. స్నానం చేయించడం చీర కట్టడం జడ వేయడం మందులు పళ్ళ రసాల దగ్గర్నుంచి అన్ని స్రవంతి చూసుకునేది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ సాయం తప్పకుండా ఉండితీరాలి. చేస్తున్న సేవలు చూస్తుంటే రాజ్యలక్ష్మికి మనసు కరగటం మొదలు పెట్టింది. ఘట్ట మాధవరావు చూసావా ఇలాంటి కోడలు రావటం మన అదృష్టం. డబ్బు గల అమ్మాయి అయితే నిన్నెలా చూస్తుందా వదిలేసి వెళ్ళిపోయేది. ఆలోచించు నువ్వు ఎన్ని మాటలు అన్నా నా మనసులో పెట్టుకోకుండా మీకు సేవలు చేస్తున్నది ఇప్పటికైనా నీ మనసు మార్చుకుంటే మంచిది అన్నాడు మాధవరావు. రాజలక్ష్మి నెమ్మదిగా కోరుకుంటున్నది కోడలు చూపిస్తున్న ప్రేమ కు. రాత్రి పగలు కంటికి రెప్పలా చూస్తున్నది శ్రవంతి. అమ్మ స్రవంతి చిన్న దాని వైన చేతులు పట్టుకుంటాను నన్ను క్షమిస్తావు కదూ. ఇన్నాళ్లు నిన్ను అర్థం చేసుకోలేక పోయాను కోడలంటే కొరివి దెయ్యం అనుకొని సాధించాను. కూతురిల్లా చూస్తావ్ అనుకోలేదు. కూతురు కూడా నీ అంత ప్రేమగా చూడలేదు నిన్ను అపార్థం చేసుకున్నాను. నాకు నువ్వు నువ్వు కోడలు పైన కూతురు లాంటి దానివే అంటూ చేతులు పట్టుకుంది. అత్త కూడా అమ్మ లాంటిదే అంటారు నేను మీ కూతురు నే అనుకోండి మీ ఆరోగ్యం కుదుట పడేదాకా విశ్రాంతి తీసుకోండి. అంటూ అత్తగారిని ఆప్యాయతగా ఇలాగే ఉంటే బాగుండని మనసులో అనుకున్నది. కూతురు లాంటి కోడలు వైపు కృతజ్ఞత పూర్వకంగా చూసింది రాజ్యలక్ష్మి.