తృప్తి...అచ్యుతుని రాజ్యశ్రీ

 బుద్ధుడు చెప్పినా ఎవరు చెప్పినా  మనిషి కి తృప్తి  అనేది ఉం డాలి. అలా అని ఉన్నదానితో సరిపెట్టుకోమని కాదు. మన కృషి చేస్తూ ఇతరుల సిరి సంపదలు చూసి అసూయ పడకుండా ఉండటం కూడా  తృప్తిలో భాగమే.అప్పుడే మనం హాయిగా సంతోషంగా ఆరోగ్యం గా బతకగలం.ఇంకో విషయం గుర్తు ఉంచుకోవాలి. సమయస్ఫూర్తి తెలివితేటల తో  అనుకున్న పని పూర్తిఛేయటం  తృప్తి కలిగిస్తుంది. మరి ఇది చదవండి. 
   రాము కట్టెలు కొట్టి సంసారం ని ఈదుతున్నాడు. భార్య సీత చాలా  తెలివిగలది.రాము కి ఎన్నో కోరికలు ఆశలు.శక్తి ఉన్నప్పుడు  కట్టెల వ్యాపారం చేయగలడు.అయినా  అడవులు నరకకూడదని  ప్రభుత్వం  జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే భార్య  చిన్న కిరాణాషాపు పెట్టి నడపుతోంది. దంపతుల కి సాధు సన్యాసులంటే మహా భక్తి. ఒక సాధువు సీతకి పరుశువేది ఇచ్చి  "అమ్మా!ఈవేళ పున్నమి. భక్తి తో దీన్ని పూజ చేయి.సూరీడు  అస్తమించక ముందే ఇనుపవస్తువుకి దీన్ని తగిలిస్తే  బంగారం అవుతుంది  "అని వెళ్ళాడు. రామయ్య లో దురాశ పెరిగిపోయింది. ఇంటి లో అన్నీ చిన్న చితక మేకులు మాత్రమే ఉన్నాయి. అందుకే  ఓ పెద్ద ఇనపపాత్ర కొంటానికి బైలుదేరాడు.ఈరోజుల్లో ఇనపపాత్ర లు ఎవరువాడుతున్నారు?చిన్న పోపు వేసే గంటె పెనం తప్ప  ఏమీలేవు. ఆఖరికి గీసిగీసిబేరమాడి చిన్న ఇనప బకెట్ తో ఇల్లు చేరాడు.సూర్యాస్తమయం అవుతోంది. పరసువేదిని దాని చుట్టుపక్కల అంతా తగిలించాడు. ఉహూ!అది ఇనపబకెట్ గానే ఉంది. సీత  అంది"ఇదిగో !సమయం దాటి పోతోంది అని నీ ఇనుపగొడ్డలికి తగిలించాను.దీనితో తృప్తి పడు.ఊరంతా వెతికి సమయం వృధా చేశావు.దురాశ దు:ఖానికి చేటు అని తెలీదా?"
ఆమె మందలింపుతో  రామయ్య కళ్ళు తెరుచుకున్నాయి.