పీవిఘనత:-:జెగ్గారి నిర్మల-సిద్దిపేట

 సీ.ప 
వంగర గ్రామాన వరపుత్రుడిగ వెల్గి
తెలగాణ జాతికే తెచ్చె కీర్తి
పదునాల్గు భాషల్లో పట్టును సాధించి
చిక్కని రచనలు జేసె నతడు
సాహితీ వేత్తల సారస్వతిగ నెంచి
వినయము జూపిన విజ్ఞు డతడు
పక్షపాతములేక పాలించి దేశమున్
తెలుగు వాడిగ ఘనత తెచ్చినాడు
తే‌‌.గీ
ధీర వరుడవీవు పరోపకారివీవు 
స్థితప్రజ్ఞత గల్గిన క్షేమ కరుడ
విశ్వ హితకారివైసాగి  వెల్గి నావు
భారతావని పులకించి పరవశించె
మరువబోరులే మానవుల్ మహినిమిమ్ము
కందం:
పలు భాష లెన్నొ నేర్చియు
అలుపన్నదిలేక నతడు నవనిన 
వెల్గెన్
విలువైన రచన జేసియు
పలు సేవలు సల్పినాడు ప్రజలకు పీవీ