నియతి లేని స్వేచ్ఛ:- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
విహారమయ్యే విహంగాల శైలి 
అనేకానేక వైవిధ్య పర్యావరణరక్షణలై... 
బ్రతుకు బ్రతికించు సూత్రంగా 
స్వేచ్ఛా సమీరాలకు కృతజ్ఞతలు చెప్తూ.. 
జీవనం దుర్భరమైన క్షణం 
ఆత్మ త్యాగం స్వేచ్ఛా తీర్పు!

మానవ మనుగడలోని స్వేచ్ఛ 
కట్టుబాట్ల కనురెప్పలు దాటని 
చూపులై 
పెదవి అంచున దాగే చిరునవ్వుల 
వినిపించని సవ్వడిగా 
సమాజం హర్షించే పద్ధతిలో.. 
ఉన్నపుడే కదా ఆమోదకరం? 
"నా ఇష్టం " తో సర్వుల నష్టం 
నియతి లేని స్వేచ్ఛ అరిష్టం!

ఇప్పుడు మరింత లోలోపల యుద్ధం.. నిందలు మోస్తూ, 
స్వేచ్ఛగా మత్తుపదార్థం అమ్మకం,కొనుగోళ్లు.. 
సమయం లేదు మిత్రమా.. అన్నట్టు.. 
ఇదేమి యావ.. ఇక్కడ భార్యా బిడ్డలే కాదు... 
ఊపిరికి ఉసురు పెట్టిన వాళ్ళు 
కూడా బాధితులే.. 


నియతి ఉన్న స్వేచ్ఛ..
 డoగు సున్నపు ప్రాచీన కట్టడం, 
శతాబ్దాల దృఢత్వం!
బూడిద కలిపిన కంపెనీ 
సిమెంట్ నియతి లేని స్వేచ్ఛ!
ఎపుడో కూలొచ్చు !!