రాష్ట్ర గవర్నర్ గారు జారీచేసిన జూనియర్ రెడ్ క్రాస్ ప్రశంసాపత్రాలను వివిధ పాఠశాలలకు అందజేసిన డా.తెలుగు తిరుమలేష్

  ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తమిళ సై సుందర్ రంగరాజన్ ఆదేశానుసారం 2019లో  విద్యాసంస్థల్లో విద్యార్థుల సభ్యత నమోదు స్కూల్ రిజిస్ట్రేషన్ నమోదు చేయడం జరిగింది.విద్యార్థులకు విద్యార్థి దశలోనే సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలని సేవా కార్యక్రమాల్లో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలని విద్యార్థులకు సామాజిక సేవ పట్ల శిక్షణ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం తో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విద్యార్థులకు జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వం నమోదు చేసినందుకు గాను  విద్యా సంస్థలకు స్కూల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.
          ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా చైర్మన్ ఖాజా కుతుబుద్దీన్ గారు పంపిన ప్రశంసాపత్రాలను కరోనా నేపథ్యంలో గవర్నర్ జారీచేసిన పత్రాలను  విద్యాలయాల వద్ద అందజేయాలని సూచించడంతో ఈరోజు ఆత్మకూర్ పట్టణంలోని విద్యా సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా సభ్యులు డా.తెలుగు తిరుమలేష్  గారు  స్కూల్ ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి,వారి బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసులు ,కలాం పాష,సభ్యులు ఫయాజ్ ,రఘు ఉపాధ్యాయులు నజీర్ అహ్మద్ ,ఆదం ,రాజేంద్ర ప్రసాద్ ,రమాదేవి విజయలక్ష్మి ,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
        ఈ సందర్భంగా ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ ప్రశంసాపత్రాన్ని అందుకుంటూ రెడ్ క్రాస్ రాష్ట్ర  అధ్యక్షులు గవర్నర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.