కందిలి:-సునీతా ప్రతాప్

నాకు రెండు కండ్లను ఇచ్చి
చూపును  ఇచ్చిన కందిలి !?

నా ఇంట్లో వెలిగి
నన్ను ఊరంతా వెలిగించిన కందిలి !?

చీకటిని తొలగించి రాత్రిపూట
నన్ను చదివించి
నా మదిని కదిలించిన కందిలి !?

మెదడులో దీపమై
నన్ను వదిలి పోనీ కందిలి !?

ఇంట్లో వీధిలో రహదారిలో
నాకు దారి యై 
వెలిగిన కందిలి !?

చదువురాని కందిలి
చమురుతో వెలిగి
ఊరందరికీ ఉపాధ్యాయుడు యై
ఒక వెలుగు వెలిగిన కందిలి !?

రాత్రంతా తను నిదురపోక
మనల్ని నిద్రపుచ్చి
పొద్దున మనల్ని మేల్కొల్పి
తాను ఆరిపోయిన కందిలి !?

Sunitapratap
Teacher
8309529273