గుహుడు శ్రీరాముడు(బాల గేయం)--యెల్లు .అనురాధ రాజేశ్వర్ రెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి మండలం కొండపాక సిద్దిపేట

 పరమ భక్తుడు గుహుడు
 రామభక్తుడు గుహుడు
 ఆటవీక జాతిలో
 ఆణిముత్యముగుహుడు 
//పరమ//
 అయోధ్య విడిచిండు ఆరాముడు
 కదిలాడు అడవికి శ్రీరాముడు
 సీతలక్ష్మణులతో ఆ రాముడు
 ముందుకె కదిలిండు శ్రీ రాముడు
// పరమ//
  శృంగిబేరిపురం దారిలో వచ్చింది
 ఆనగరంకు రారాజు మన గుహుడు
 ఆహ్వానం పలికే రామలక్ష్మణులకు
 సంతోషముతోడ యేతెంచ్చి వచ్చిరి 
//పరమ///
 మద్ది పాలను ఇచ్చే ఆ గుహుడు
 జఠారులైరి రామలక్ష్మణులు 
నదిని దాటించే ఆ భక్త గుహుడు
 దీవించి వెళ్ళేరి రామలక్ష్మణులు
// పరమ//