రామాయణం, భగవద్గీతల వైశిష్ట్యం:-రాజశ్రీలుపిల్లి.హజరత్తయ్యశింగరాయకొండప్రకాశం జిల్లా
101) రామ గాథలు  ఆదర్శవంతమైనవి
మానవ జీవితానికి మార్గదర్శకమైనవి
జీవిత సమస్యలను అధిగమించవచ్చు
సంస్కారాన్ని అలవాటు చేసుకోవచ్చు

 102) సీతారాములది ప్రేమ అనుబంధము
అన్యోన్య దాంపత్యానికి నిలువుటద్దము
రామకథ గురుభక్తిని నేర్పును
ఇది భాతృప్రేమను చాటును

 103) సుఖానికి సంపద అవసరమే
అదే పరమార్థమైతే అనర్థమే
రామాయణం మనకు ఆదర్శము
భగవద్గీత అందరికి అనుసరణీయము

104) ఆనందంలో మాట ఇవ్వకు
దుఃఖంలో నిర్ణయాలు తీసుకోకు
జీవితంలో మలుపులను ఆనందించాలి
ప్రయాణంలో మలుపులను ఆస్వాదించాలి

105) రామకథ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది
సంభాషణా నైపుణ్యం తెలుపుతుంది
నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి
కార్యసాధన నైపుణ్యాలు పెరుగుతాయి

106) ధర్మానికి భాష్యం గీత
మార్చును మన తలరాత
నీకర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి
ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి

107) గీత విజయానికి సోపానము
నరునికి గీత ఆమోదయోగ్యము
గీతలో ఏడువందలు శ్లోకాలున్నాయి
భగవత్ప్రాప్తికి మార్గాలు వివరించబడ్డాయి

108) గీతను ఒంట బట్టించుకో
బీరుడు ధీరుడౌతాడు తెలుసుకో
భోగి యోగిగా మారుతాడు
అజ్ఞాని విజ్ఞాని అవుతాడు

109) గీత ఒక జ్ఞాన గంగ
అది తీర్చును మనబెంగ
అవివేకిని వివేకిగా మార్చును
నాస్తికుడుని ఆస్తికుడుగా మరల్చును

110) గీత మానవధర్మాన్ని బోధించును
రామగాధ నీతిని తెలుపును
రామాయణం నిత్య పారాయణము
గీతోపదేశం నిత్యం అవశ్యము