మహాదేవ యోగము: -ఎం. వి. ఉమాదేవి ఇందుకూరు పేట ,నెల్లూరుజిల్లా
సత్యము శివమును సాధన చేయుము 
నిత్యము పరమును నిజముగ దలచుము 

యోగము తపమును యోచన జేయుము 
భోగము లందును భోగవిరక్తము 

పాపవి నాశము పావని రూపము 
దీపము హృదయము దీవెన మధురము 

హిమగిరి శిఖరము హితకర వాసము 
సుమవిధి లలితము సుధదర హాసము

గౌరికి వశమగు  గౌతమ హాసము 
గౌరుని వాసము గౌళము నామము 

మోహము దూరము మోదము నటనము 
మోహిత నయనం  మోహిని సరసము


కామెంట్‌లు