నమ్మకం - జగదీశ్ యామిజాల

 మనిషి 
చెట్లను నరికేయడంతో
నివాసం కోల్పోయిన పక్షి
సిగ్నల్ పోస్ట్ లో 
అందులోనూ
ఎర్రసిగ్నల్ అరలో 
పిల్లలతో కలిసి
గూడు ఏర్పాటు
చేసుకుంది
మరో దారి లేక
ఇదైతే
ఎవరూ తొలగించరని
పక్షి ప్రగాఢ నమ్మకం