నాలుక తడి ఆరినట్లుగా ఉండడం: పి . కమలాకర్ రావు

నాలుక తడి ఆరినట్లుగా ఉండడం
నాలుక పిడచ గట్టి నాట్టు అవడం
- నివారణ
శరీరానికి కావాల్సినంత నీరు అందనప్పుడు, అనారోగ్యం వల్ల మందులు వాడుతున్నప్పుడు  ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నాలుక తడి ఆరిపోయి నట్టుగా ఉంటుంది.
      1.    కొన్ని తంగేడు ఆకులు, పూలు, మొగ్గలు , కాయలు  తెచ్చి
ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి
నీటిలో వేసి  తాటి బెల్లం వేసి మరిగించాలి. చల్లారిన తరువాత
త్రాగితే దాహం తీరి నాలుక తడి ఆరడం తగ్గిపోతుంది.
2. కొన్ని రావి చెట్టు ఆకులు తెచ్చి బాగా కడిగి ముక్కలుగా కత్తిరించి నీరుపోసి తాటి బెల్లం వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. నాలుక
మామూలుగా అవుతుంది.
3. బిళ్ళగన్నేరు 5 పూలు తీసుకొని
    రిక్కలు మాత్రమే తీసుకొని కడిగి
     బెల్లం వేసి నీటిలో మరిగించి
    చల్లార్చి త్రాగాలి. దీనితో కూడా
    అతి దాహం సమస్య తీరు
    తుంది.
      శరీరానికి  కావలసినంత నీటిని
      త్రాగడం చాలా ముఖ్యం.