అమ్మకందాలు -సరళ గున్నాల-జి.ప.ఉ.పా మల్కాపూర్-సంగారెడ్డి జిల్లా

అమ్మాయనుచును ప్రేమగ
అమ్మేమనలనుపిలువగ
నానందమ్మున్
అమ్మావచ్చితినేనని
అమ్మనుచేరంగబోవు నవనిన పిల్లల్

అమ్మనుమించినదేవత
ఇమ్మహివెదగంగలేదు,నెన్నగ
తరమా
సొమ్ములవెన్నియుబోసిన
అమ్మను సరితూచలేదు నవనినగాంచన్

మలమూత్రమ్ములుదీయుచు
తలపింపకనీసడింపు దరిరానీకన్
పలుకునతేనియజిందుచు
నొలికించును ప్రేమనంతనొరులేమెచ్చన్
కామెంట్‌లు