వచన పద్యాలు : - సాయి రమణి చెన్నా
1)కమనీయ కీర్తనల కవన కల్పనల 
కృష్ణ కౌముది కనుమ కెంపు 
కావ్యకీర్తి కాంతుల కదంబు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)కిరణ కిరణ్మయి కిలకిల కిషోర
కిన్నెర కెంపు క్రిష్టమ్మ కెరటాల
కిమజ కినుజ కిటుక క్రిష్టయ్య భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)కమల కోనసీమల క్రొత్త కుముదల 
కొలుపు కల్పిక కధన కొలువుల
క్రాంతి కౌమల కోమల కొయ్య భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)కుందన కంకణ కంద కంచి 
కాంచన కమనీయ కవన కూర్పు 
కెంపు కాంతి కూతల కంకు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

5)జుమ్మంది జడుల జుంజుమ జుంపాల 
జంపు జున్నుల జగతి జ్యోతుల 
జల జంగమ జ్యా జానపద భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !