’ FREN డ్స్ ‘’ … !’’ --మడిపల్లి దక్షిణామూర్తి. --అమెరికా .

 బచ్ పన్ దోస్తులు  ఊపిరి తిత్తులు 
ఆక్సిజనిస్తరు ఆయువు పోస్తరు  
బడిలో చదివిన బాల్యస్నేహితులు 
బంధం మరువరు బాగుకోరుతరు 
ఆటుపోట్లలో ఆనందాలలో 
ఆత్మీయతతో అండగ ఉంటరు 
క్లాసు మెట్లకు పాస్టన్సుండదు 
ఎవరర్ ప్రజెంట్ గ ప్లెజెంటు కుంటరు 
టీనేజీఫిజు కాలేజీ ఫీజు 
బరువుబాధ్యతలు తెలవని మోజు 
ఫ్రెండ్సుంటేచాలు చాలదు రోజు 
టేకిటీజీయే నాటి రివాజు 
రోటీ కాపాడా మకాన్ ల కోసం 
అసలు జిందగీ అప్పుడే షురూ 
ఉద్యోగాలో వ్యాపారాలో 
బహుమార్గాలుగ బతుకుల తీరు 
సంసార బాధ్యతల ఉరుకులు పరుగుల 
టైమ్ దొరకని టెన్షన్ లోనూ 
ఇంచుక సొంచాయించిన చాలు 
కన్సర్న్ వచ్చి కళ్లెదుట వాలు 
మరుగున పడ్డ మైత్రి చిగురిస్తే 
బతుకున భరోసా వాన కురుస్తది 
దోస్తుల యాది మదిన మెరిస్తే 
బరువు తేలికై మనసు మురుస్తది 
బాల్యం యవ్వన ప్రౌఢ ప్రాయంలో 
వాన ప్రస్థాన వృద్దాప్యంలో 
మనిషికి బలిమి చెరగని చెలిమి 
ఫ్రెండ్షిప్పంటే తరగని కలిమి 
స్నేహం అంటే ఇంధన రూపం 
స్నేహాన వెలుగు జీవన దీపం 
దున్యా నిండిన దోస్తానీకి 
అలాయ్ బులాయ్ గ అక్షర ఆర్తి 
ఆత్మీయంగా అందిస్తున్న 
            ***
ఫోటోలో...
మ.దక్షిణామూర్తి 
రిటైర్డ్  అనౌన్సర్
ఆకాశవాణి.