పద్యాలు : చెన్నా సాయిరమణి -MA తెలుగు

1)సుందర మందార బంధుర సింధూర 
చందుర సింగార మంజీర తార 
శిఖర వీర గంభీర అంబర భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)లలిత లావణ్య లత లాస్యకేళి 
లలిత లిప్త లాలన లౌక్య 
లక్ష్య లక్షణ లిఖిత లబ్దప్రతిష్ఠ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)సంగీత సౌరభ్య సుందర సుస్వరుప
సుమనోహర సౌగంధిక సువాసనల సముహార
సుమధురాతి సర్వత్ర సార్వభౌమ భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)సంగీత సుందర సౌందర్య సౌకుమార్య
సమరత సమైఖ్య సుజ్ఞాన సాహిత్య 
సుమాలిక సుభాషిత సుమతీ సాయుజ్య భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

5)లౌక్య లిఖిత్వ లక్షణ లేఖనల 
లిల్లి లల్లీ లాస్య లతల 
లలిత లావణ్య లయామృత లిపి భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

కామెంట్‌లు