*అమ్మోరుకుముత్యాలహారాలు*:-చైతన్య భారతి పోతులZPHS నేరెళ్లపల్లి,బాలానగర్ మండలం,మహబూబ్ నగర్ జిల్లా7013264464


 1.
అమ్మవారికి బోనము
ఆశీర్వాదము ఒసగుము
పాపాలన్ని  పావనము
మొక్కులు చెల్లించెదము
2.
పరమాన్నము నైవేద్యము
ప్రేమతో పెట్టెదము
అభాగ్యుల కాపాడుము
తప్పుల మన్నింపుము
3.
ఏటేటా బోనాలు
ఆషాడం సందడులు
వాడవాడల పండుగలు
నిండెను సంతోషాలు
4.
వేదాల సారము ఎరుగ
వేదమంత్రముల ఎరుగ
నీ నామమే ఇష్టంగ
తలచెదము ప్రాణంగ
5.
నా జీవము ఈ దేహము
నింపినది నీవే కనుము
నే వేడెదను శరణము
ఎరుక నీకు ఆది అంతము
6.
రావమ్మా మమ్మేలగ
అమ్మా కరుణిoచగ
ఆది పరాశక్తిగా
శాంకరి శుభంకరిగ
7.
అలుకేల నాపైన
ఈశ్వరేచ్చను నుదుటన
తిలకంగా అమర్చిన
మది ఉప్పొంగు తలచిన
8.
అలుగులెల్ల చెరువులు
సమృద్ధిగా పంటలు
ఊరంతా సంబరాలు
అందుకో శక్తి పూజలు
9.
కోర్కెలు తీర్చంగా
పొర్లు దండాలెట్టంగా
పిల్లజెల్ల తోడిగా
కదిలొస్థిమి భద్రంగా
10.
ఎల్లమ్మా పోచమ్మా
మారెమ్మా మైసమ్మా
బోనాలు నీకమ్మా
సల్లంగా జూడమ్మా

కామెంట్‌లు