*హరిత హారంకు ముత్యాల హారాలు*:---చైతన్య భారతి పోతులZPHS నేరెళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

1.    అవనికి చెట్లoదం
       తోటకు పూలందo
       మాటలు మకరందం
       జీవిత పరమానందం..

2.     ఇంటిముందు మొక్కలు
        అందమిచ్చే మొక్కలు
        అందరు నచ్చే మొక్కలు
        హాయినిచ్చే మొక్కలు..

3.    తరువు లేని లోకమందు
        వానరాక దుఃఖమందు
        భవిత అంధకారమందు
       మొక్కలు నాటు ముందు

4.    మా తోటలో బంతులు
       మనసు దోచే మల్లెలు
       పచ్చని చేమంతులు
       అలుముకున్న కాంతులు

5.    కొమ్మ ఒకటి నాటింది
       ప్రేమతోడ పెంచింది
       తన మదిని దోచింది
       హృదయంలో నిలిచింది

6.   ధరణి అంతా పచ్చగా
      చీరకట్టు సొంపుగా
      కనికట్టు చేయగా
      కనువిందు చేసెనుగా

7.    బడిలోనా మొక్కలు
       పిల్లలు నాటే మొక్కలు
       ముచ్చటైన మొక్కలు
       ముద్దుగులోపే మొక్కలు

8.  దారిగుంట మొక్కలoట
      అందరూ నాటిరంట
      నీడనిచ్చి చూపెనంట
      హాయినిచ్చి పంపెనంట

9.    చెట్లేమో నాటితoట
       ఫలములే ఇచ్చునంట
       ఆకలేమొ తీరునంట
       ఆనందం మిగిలెనంట

10. మొక్క ఒకటి పెట్టేను
       ఆక్సిజను ఇచ్చేను
       ఆరోగ్యము పెంచేను
       ఆయువునే నిలిపేను

11.  అవని చెట్లు నరకొద్దు
       అంధకారం చేయొద్దు
       భవిత పాడు చేయొద్దు
       చెట్లతోడు మనకు కద్దు

12. పచ్చదనం రక్షణ
       హరితహారం శిక్షణ
       చేయరాదు భక్షణ
       మనకు అది రక్షణ

13. ప్రకృతి వ్యవసాయం
      మేలు చేసెఫలసాయం
      ఇచ్చును ఆదాయం
      ఆయెను జీవితాశయం

14. విషగాలిని తొలగించు
       ఆరోగ్యాన్ని కలిగించు
       ఆహారాన్ని అందించు
       ఆనందాన్ని పంచు

15.  కాలుష్యం పోగొట్టు
        ఆరోగ్యాన్ని కనిపెట్టు
        ఆయువునే పంచేట్టు
        మొక్క నాటే పనిపట్టు

16. తరువులు పెంచుమురా
       కరువును తీర్చునురా
      బరువని తలచకురా
     మనకు మేలు చేయునురా

17. భూదేవి కళ్యాణం
      ప్రకృతిలో కళ్యాణం
     తరువులతో నిర్మాణం
     అది మానవ కళ్యాణం

18. పచ్చదనం భూమిలో
      ప్రాణవాయువు అవనిలో
      ఆరోగ్యం మేనులో
      సంతోషం మోములో

19.పయనించే మేఘాలు
     చూడచక్కని అందాలు
     పచ్చని పంటచేలు
     కురిసాయిగా వానలు

20.ఓషధాల మొక్కలు
     ఆరోగ్యానికి మలుపులు
     కషాయం తాగు మేలు
     కాఫీ టీ లకు బదులు