సుతుడు 2-సాహితీసింధు సరళగున్నాల

తే.గీ*తాతయన్ననమితమైన దయనుజూపి
చేయినందించినడిపెడు చిన్నవాడు
మ్రొక్క ,వరమీయదేవుడే
ముందునిలుప
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర

తే.గీ*తోడబుట్టినతమ్ముని తోడునుండి
కష్టమన్నదిలేకుండ గాచువాడు
పెద్దవాడన్నపేరుకే ప్రేమపంచు
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర

తే.గీ*బంధు బలగము నందునప్రాపు గాంచి
ప్రేమపంచెడి కన్నయ్య క్షేమమరసి
నిండునూరేళ్ళునిలువగ నుండువాడు
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర

తే.గీ*చదువుసందెలనందున సారమెరిగి
ఉన్నతమ్ముగనుండగా నోర్పుకలిగి
కోపతాపమ్ము లేనట్టికొంటెవాడు
కొడుకునొక్కడుచాలునే కోర్కెదీర

కామెంట్‌లు