జాతీయగ్రంథాలయదినోత్సవము;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట--చరవాణి :- 6300474467

 

01.
కం.
గ్రంథాలకునాలయమిది
గ్రంథాలనుభద్రపరిచికళకళలాడున్
గ్రంథమ్ములతోవెల్గుచు
గ్రంథాలయ"జ్ఞాన"గంధగాలులువిసురున్!!!
02.
కం.
మౌనపఠనాలయాలివి
పూనియుజ్ఞానమ్మునొసగిప్రోత్సాహమిడున్
మానితమగుగ్రంథాలను
మానకచదివించుచుండిమాన్యులజేయున్!!!
03.
సీ.
వేలపొత్తాలతోవికసించివిజ్ఞాన
మందించుసతతంబునవనిపైన
ఒకసారిదర్శించియొకసారికూర్చొని
కుదురుగాచదివినముదముగల్గి
పోటీపరీక్షలన్పాటిగాయెదురించి
యుద్యోగమిప్పించియోగ్యతనిడి
పఠనాభిలాశనుపాఠకులకొసంగి
సన్మార్గబాటలోసాగనంపి
(తే.గీ.)
అట్టి"గ్రంథాలయమ్ములు"పట్టుకొమ్మ
లై, భవితకును,నుపదేశ,లాభములను ,
విషయసారమ్మునంతయువిశదపరచి
ప్రగతిపాటవాలందించిపాటుపడును!!!కామెంట్‌లు