"శివస్తుతి-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
కం.
కైలాసవాసయీశా !
ఫాలేక్షుడ,రుద్ర,సాంబపార్వతినాథా
బాలేందుశేఖరుడ ,రా
మేలునుచేకూర్చిశుభముమెండుగనివ్వన్!!!


02.
కం.
హరహరశంభోశంకర
పరిపరివిధములభజింతుప్రమథాధిపతీ
కరుణనుచిందియుభువికిని
త్వరగావేంచేసిభక్తతతిబ్రోవుమయా!!!

03..
సీ.
మంజునాథుడయనిమధురముగనుబిల్వ
నరుదెంచునాతండునాత్రముగను
సాంబా!రుద్రాయనిఅంబభవునిబిల్వ
పురహరుడైస్వామిబ్రోచుమనల
పరమేశుడాయనిభక్తితోడనుబిల్వ
విభవమ్మునందించిఅభయమొసగు
విశ్వేశ్వరుండనీప్రియమారగనుబిల్వ
ముక్కంటిమనలకుదిక్కుయౌను
(తే.గీ.)
అర్థనారీశ్వరాదేవఅస్థిమాలి
జన్మజన్మకుస్మరియించిజపముజేసి
భస్మధారుణివేడగాబాధలన్ని
తొలగజేయుచుమోక్షమ్ముకలుగజేయు!!!

కామెంట్‌లు