"మాటమకరందపద్యాలు"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేట-చరవాణి :- 6300474467

 01.
ఆ.వె.
పదముపదమునందుముదముగొలుపునట్లు
ముచ్చటించవలెనుముద్దుగాను
మాటతీరుబట్టిమర్యాదలభియించు
"రంజితన్నజెప్పురమ్యమలర"!!!
02.
ఆ.వె.
మాటలెపుడుకూడమాధుర్యమునుపంచు
నటులపలుకవలెనునవనియందు
చెడ్డమాటలెపుడుచేటునుకొనిదెచ్చు
"రంజితన్నజెప్పురమ్యమలర"!!!
03.
ఆ.వె.
మాటమణులమూటమాటయేబాటయై
మంచితనముపంచుమాన్యులకును
మాటభూషణంబుమానవులకుసదా
"రంజితన్నజెప్పురమ్యమలర"!!!
04.
ఆ.వె.
మాటతోడవిలువమాటతోగొడవయా
మాటవరమునయ్యిమన్ననొసగు
మాటతోడమెతుకుమాటతోబ్రతుకయా
"రంజితన్నజెప్పురమ్యమలర"!!!
05.
ఆ.వె.
మాటనోటిపూలతోటలైవికసించి
పరిమళమ్మునొసగుపలువిధాల
మాటరంజితంబుమాటసహృదయంబు
"రంజితన్నజెప్పురమ్యమలర"!!!


కామెంట్‌లు