*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౦ - 70)

 శార్దూలము:
*రోసిందేటిది రోతలేటివి మనో గ్రస్తుండుగా దేహితా*
*పూసిందేటిది పూతలేటిదివి మదా | పూతంబు లీ దేహముల్*
*మూసిందేటిది మూతలేటివి సదా | మూఢత్వమే కాని తా*
*చేసిందేటిది చేతలేటివి వృథా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మా మనుషులు అసహ్యించుకున్నాము అంటారు కాని దేనినీ అసహ్యించుకోరు. పూసున్నాము అంటారు కానీ విబూది రాసుకోరు. గందము మొదలైన సువాసన ద్రవ్యములు పూసుకుంటారు.  అన్నిటినీ విడిచేసాము అంటారు కానీ అహంకారాన్ని విడిచి పెట్టరు.   ఎన్నెన్నో పనులు చేసాము అంటారు కానీ మంచి పని ఒక్కటి కూడా చేయరు. ఇది మా మనుషుల తీరు, పోకడ.........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మా మనుషులము ఎన్నో చూసాము, అన్నటినీ వదిలేసాము, ఇంకా ఎన్నో చేసాము అనుకుంటాము తప్ప, నిజంగా ఎదుటి వారికి పనికి వచ్చే పని చేయము. మా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి పనికి వచ్చే పనీ చేయము.  మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి దారి చూపే సద్గురువు తానే పిలిచినా గుర్తించడం చేతకాని వాళ్ళము. ఒట్టి పిచ్చి వాళ్ళము.  ఇటువంటి నీ బిడ్డలైన మమ్మల్ని, మేము పడుతున్న ఆందోళనలనుండి దూరం చేసి నీ సన్నధికి చేరే మార్గము చూపించు మా కన్నతండ్రీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు