*స్నేహానికి చైతన్య ముత్యాల హారాలు*:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

 165.
స్నేహానికి చిరునామా
ఆపదల ఆదుకోమా
అరమరికలు బాపుదామా
హాయిగా ఉందామా
166.
నీవు నాకు నేను నీకు
ఒకటై సమాజమునకు
చేయు చైతన్యమునకు
సమాజ ఉద్దరణకు
167.
కష్టాల్లో శస్త్రంగ
దారితప్పితె శాస్త్రంగ
కుట్రల్లో బుద్ధిగ
చూపును స్నేహమేగ
168.
అత్యంత శక్తివంతము
బుద్ధి శస్త్రము శాస్త్రము
బలము అని అందరము
నమ్ముతాము మనము
169.
అసలైన ధనవంతుడును
ఆపదలో ఆదుకొనును
దారిని చక్కదిద్దును
మానవత్వo చూపును
170.
శరత్కాలపు వెన్నెలలు
వాడని వసంతములు
స్నేహ కుసుమ మాలలు
అమృతమైన దారలు
171.
మానవ సంబంధాలు
నేడు ఆర్థిక బంధాలు
కరువై పోయి విలువలు
ఆయెనులే యాంత్రికాలు
172.
భాష అంటూ లేనిది 
బంధమై నిలిచినది
స్నేహమనేదొకటున్నది 
సృష్టిలో తీయనైనది
173.
మధురమైన బంధం
మమతలు పంచే గంధం
సృష్టిలోని సుగంధం
మారువని ఆనందం
174.
కలిమిలేములు ఎరుగనిది
కులమతాలు చూపనిది
కుతంత్రాలు తెలియనిది
స్నేహం శాశ్వతమైనది
175.
అలసి పోయిన వేళను
ఆత్మీయత పంచును
ఒంటరియైన వేళను
ఓదార్పును ఇచ్చును
176.
కలిమి కోరని స్నేహం
కలత లెరుగని స్నేహం
కడవరకును స్నేహం
నిలవాలిలే స్నేహం
177.
స్నేహ దీపo వెలగాలి
ఆనందం విరియాలి
అనంతంగా సాగాలి
ఆకాక్ష నెరవేరాలి

కామెంట్‌లు