*ముత్యాల హారాలు*:---చైతన్య భారతి పోతుల- హైదరాబాద్-7013264464

 178.
ఒకటే మనసు మేఘమును
మోయలేక తన బరువును
నేరుగా ఒలికి పోవును
భారమే ఏదైనను
179.
నవ్వులున్న చాలును
నరకమును తప్పించును
వానొస్తే చాలును
పంటలన్ని పండును
180.
పిల్లలున్న ఇంటిలోను
వెన్నెలలే కురియును
మల్లెలున్న తోటలోను
పరిమళమే పారును
181.
లంచమిస్తె పని జరుగును
లంచానికి ఓటు పడును
చదువుకున్న వాడైనను
బుద్దిలేని పనియాయెను
182.
ఓట్ల పండుగొచ్చింది
కపట ప్రేమ పుట్టింది
వరాల జల్లు కురిసింది
ఓటు అమ్ముడు పోయింది
183.
అడుక్కునే వాడిగ నీవ్
ఎంతకాలము ఉంటావ్
అధికారము నీదిగ నీవ్
ఎదగవా ఏమంటావ్

కామెంట్‌లు