విశిష్టమైన రాఖీ: -చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464
ఒకే కొమ్మకు పూచిన పరిమళం
ఆత్మీయతలల్లుకున్న అపురూప బంధం
సోదర ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం
అవనిలో అమూల్య సంబంధం
జగద్రక్షణకే నెలవైన రాఖీ బంధం

అనిర్వచనీయం అన్నాచెల్లెలి బంధం
అమ్మానాన్నలతో సరిపోలు సంబంధం
కలిమి లేములలో కాపాడే బంధం
అన్నలా ఆదుకునే రక్షణ బంధం
కానవసరం లేదు రక్తసంబంధం

అహంకారాల కతీతం సోదర ధైర్యం
సమాజ వంకర చూపులకు సైనికుడై
భవిష్యత్తు బాధ్యతను భుజస్కంధాలపై
చెల్లెమ్మకు రక్షణ కవచమోలే
విలువలకద్దం పట్టే వైశిష్టమే రాఖీ

సమతా మమతల సౌభ్రాతృత్వము
అనుబంధాల అంకురమే సంప్రదాయాలు
గొంతెమ్మ కోరికలకు స్వస్తి పలికి
మనసులల్లుకున్న మల్లెల సుగంధమై
ఎదలో దాచుకొని లోకరక్షణ నీయాలి.కామెంట్‌లు