*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౧ - 71)

 శార్దూలము:
*శ్రీశైలేశు భజింతునో యభవు గాం | చీనాథు సేవింతునో*
*కాశీవల్లభు గొల్వబోదునో, మహా కాళేశు బూజింతునో*
*నాశీలంబణువైన మేరువనుచున్ | రక్షింపవే నీ కృపా*
*శ్రీ శృంగార విలాసహాసములచే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
నేను శ్రీశైలం లో మల్లికార్జునుని, ఉజ్జైనిలో మహాకాళుని, కంచిలో ఏకామ్రనాథుని, కాశీ విశ్వేశ్వరుని  పూజించ లేదు. ఇది నిజం.  నేను నిన్ను తలచుకున్న ఒక చిన్న విషయాన్ని నీ పెద్ద మనసుతో, నేను చేసిన పెద్ద పూజగా ఒప్పుకుని నన్ను రక్షించడానికి చిరునవ్వుతో వచ్చావా స్వామీ! .........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నాకు క్షేత్ర దర్శనమూ తెలియదు, క్షేత్ర పాలక పూజా తెలియదు. మహాకాళుడూ, ఏకామ్రనాథుడూ, విశ్వేశ్వరుడు,  చివరికి మల్లికార్జునుని ఎవ్వరినీ సేవింప లేదు.  నాకు తెలిసింది, నేను నమ్మింది, నమ్మి నిలుపుకుంది ఒక్కటే ఒక్కటి. "శివ" నామ స్మరణ. " నామ స్మరణే ధన్యోపాయం" అన్నారు కదా. మరి "శివ శివేతి శివేతివా! భవ భవేతి భవేతివా!" అని కూడా అన్నారు కదా! పార్వతీ పతీ!  అమ్మ అంబతో కలసి నీ బిడ్డలను నీవే కాపాడాలి, త్రిభువనేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు