*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౨ - 72)

 మత్తేభము:
*అయవారై చరియింపవచ్చు, తమపా | దాంభోజ తీర్థంబులన్*
*దయతో గొమ్మనవచ్చు, సేవకుని న | ర్ధప్రాణదేహాదు ల*
*న్నియు మాసొమ్మనవచ్ఛు గాని, సిరుల | న్నిందింప, నిన్నత్మ ని*
*ష్క్రియతన్ గానగరాదు, పండితులకున్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
ఎన్ని చదువులూ, శాస్త్రాలు చదివిన వాళ్ళైనా, తమకు చాలా తెలివి కలదని, తామే గొప్పవారని, తమ శిష్యులు తమ కాళ్ళు కడిగి, ఆ నీళ్ళు నెత్తన చల్లుకుని, తీర్ధముగా తీసుకోవచ్చు అని చెప్తారు గానీ, వారు డబ్బు దస్కం, మణులు మాణ్యాలు వద్దని, నీ ధ్యానమే సర్వస్వం అని ఏనాడూ అనుకోలేరు .........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*రాకేందు ధరా, పార్వతీ పరమేశా, మేము ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానానార్జన చేసినా, మా మనస్సామ్రాజ్య ద్వారాలు తెరచి, అందులోకి నిన్ను ఆహ్వానించి నిలపలేక పోతున్నాము, నా తండ్రీ!  మా ఈ లౌకిక చదువులు, నీ ద్వారా వచ్చే అలౌకిక ఆనందం ముందు దిగదుడుపే కదా, పన్నగభూషణా! నీ సాన్నిహిత్యానికి నన్ను దూరం చేసే ఏ చదువు కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేదూ, నాకు అవసరమూ లేదు. ఏంమాయచేసైనా, నన్ను నిరంతరం నీ సన్నిహితంగా మెలిగేటట్టు అనుగ్రహించు, పంచనగేశా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు