యువతా మేలుకో:-శ్రీతరం బింగి శ్రీకాంత్కొప్పునూర్, వనపర్తి7893613015
ఓయువతా మేలుకో
ఎటువైపు నీ గమ్యం
ఎక్కడుంది నీ లక్ష్యం
మత్తు మందు పొదల మాటున
తేలిపోయి నిషా ఊయల ఊగుతుందా
ఆన్లైన్ నదిలో మునిగి తేలుతూ
ఒడ్డు చేరలేక నిర్వీర్యమవుతుందా

కులమతాల కుండలో ఉడుకుతూ
రాజకీయ పార్టీల జెండాల నీడలో మగ్గుతూ
ఉపాధి ఆకలికి సుష్కించి సుష్కించి
నిస్సహాయత వలలో చిక్కిశల్యం అవుతుందా

ఐదేండ్ల కోసారి వచ్చే జలంధరుల
అధికార దాహంలో నీరుగారి పోతుందా
రెండు నాలుకల ధోరణి పాలన
పడగ కింద నీ శక్తి యుక్తి అభాసుపాలవుతుందా

ఎటుపోతుంది నీ మార్గం యువతా
మేలుకో నిన్ను నీవు తడుముకో
నీరాశ, నిస్పృహలను విదిలించి 
ఆశలు, ఆశయాలను సూదిలో పోసి
ధైర్యమనే రెక్కలను కుట్టుకొని
ఎగురు చేరే గగన సీమ నీదే

చరిత్ర పుటలు సైతం
నీకు కరవాలం అందిస్తాయి
దుర్భేద్యమైన కంచుకోటలు
సైతం నీకు స్వాగతం పలుకుతాయి.కామెంట్‌లు