*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౪ - 84)
 శార్దూలము:
*విత్తజ్ఞానము పాదునిత్యము, భావా | వేశంబు రక్షాంబువుల్*
*మత్తత్వంబు తదంకురంబనృతముల్, | మారాకు లత్యంతదు*
*ర్వృత్తుల్ పువ్వులుపండ్లు మన్మధము భా | విర్భూతదోషంబులుం*
*చిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మా మనసు ఒక గంజాయి మొక్క విత్తనం లాంటిది. మాకు వున్న ఆశలు ఆ మొక్క పెరగటానికి పోసే నీళ్లు.  ఎదుటి ఆడవారి మీద కామంతో మేము చేసే ఆలోచనలు, పనులు, ఆ పిచ్చిమొక్కు వేసే మారాకులు. ఇలా చెడు లక్షణాల వరదలో కొట్టుకు పోతున్న  మా మనసుకు మంచి మార్గంలో ప్రయాణించే అలవాటు నీవు ఎప్పుడు చేస్తావు మా కన్నతండ్రీ!........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*కకావికలమైన మా మానసిక స్థితిని నీకు ఎలా, ఎంత వర్ణించి చెప్పమంటావు, పన్నగేశా!  కాలకూట గరళాన్ని నీవు గళంలో వుంచుకుని కూడా, మా అందరికి చల్లని వెలుగులు ఇవ్వడానికి చంద్రశేఖరుడయ్యావు.  కానీ,  నిలకడ లేని లక్షణాలతో  వున్న మా మనసు  నిరంతరం చెడు పనులు చేస్తూ చెడు ఆలోచనలు చేస్తూనే వుంటుంది.  ఎప్పుడైనా ఒక్క క్షణం మంచి ఆలోచన వస్తే, మరుక్షణం టెంపరి పనుల ఆలోచనలే.  ఇంత అనిశ్చితి లో వున్న మా మనసును, నీ వైపు తిప్పి, నీతో నిరంతరం కలసి వుండే టట్లు మమ్మల్ని నీవే రక్షించాలి, నాగభూషణా, నటరాజా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు