తెలుగు వైభవం:- సోంపాక సీత భద్రాచలం 8639311050
భాషల మధువనిలో తెలుగు ఓ కల్పతరువు
పలకరించిన చాలు భావాల గుభాళింపులు చిలకరించు..

అక్షరాల రెమ్మలనుస్పర్శించిన చాలు
ఇక్షురస ధారలనుగృమ్మరించు
కనుసైగ చేసిన చాలు
పదాల పాదపమ్ముజలజలా రాలు..

మన పెరటిలో తెలుగుభాషాతరువు ఒక్కటున్నచాలు
వినసొంపైన రాగఝరులసోయగాలను మదిమదిలో నింపి
హృదిహృదిలోఅవగాహనానురాగాలను తట్టిలేపు..

అరవ,కన్నడ,సంస్కృతాక్షరావిరులను
సమ్మిళితం చేసుకుంటూ
 విజ్ఞానపు సంగమమై ఆనందవిహారం చేయించు..

కవుల వాకిట కవనమై,
గాయకస్వరాన విపంచి గీతమై,
శతకకర్తల చెంత పద్యమై,
జానపదంతో చిందేస్తూ జ్ఞాన పథమై..

ఓహోహో...! ఎంతనిచెప్పను?
తెలుగు వైభవం అక్షయమే..

                

కామెంట్‌లు