అమ్మ భాషకు వందనం* (కైతికాలు) - ముత్యాల రఘుపతి-9014767045
మొదటగ పలికిన మాట
అమృత వాక్కుల ఊట
బుజ్జీ  పాపల నోట
పసిడి  రాసుల మూట 
వారెవ్వా మాతృబాష
పుట్టుకతో పీల్చే శ్వాస

విదేశీ భాషన  ధ్యాస
అనగా వినగా  నస
మనసున దూరక  హింస
మనసులు కలవక గోస 
అరెరే ఈ  పరాయి భాష
ఒడవుదుగా ఆత్మ ఘోష

పురాణ గాథలే  వరం 
నీతి కథలలో సారం
సుమాలు అల్లిన  హారం
సుదూర లక్ష్యపు  తీరం
వారెవ్వా  భాషావైభవం
అంబరం చేరిన  సంబరం

పద్య పరిమళ సోయగం
గద్య కవనపు మాధుర్యం
నవ్య రచనల సౌరభం
కలం  శిల్పుల సౌందర్యం
వారెవ్వా భాషా వైభవం
అబ్బురపరిచే కుందనం

కవన రంగపు వేదిక
అంగరంగపు వేడుక
పసిడి రాశుల యవనిక
అవని అందాల కానుక
వారెవ్వా భాషా వైభవం
అమ్మ భాషకే  వందనం

 


కామెంట్‌లు