*ముందున్నది పెనుముప్పు**కావాలిప్పుడు కనువిప్పు*:-*' కావ్యసుధ'* సీనియర్ జర్నలిస్ట్ విశ్రాంత హయాత్ నగర్ హైదరాబాద్ 9247313488

 అమెరికా, చైనా ఆస్ట్రేలియా                       
వంటి దేశాల్లో మళ్లీ ఆంక్షల                    
  విధింపు ఘట్టాలకు తెర తీస్తోంది
ప్రపంచాన్ని వణికిస్తున్న
కరోనా మహమ్మారి
రూపం మారి
డెల్టాగా సంక్రమించి
అతలాకుతలం చేస్తోంది
కరోనా వైరస్ డెల్టా రకంగా
ఉత్పరివర్తన చెందింది.
డెల్టా వేరియంట్ కు 
వేగంగా వ్యాపించే
లక్షణంఉన్నదట !
దీనికి విరుగుడు టీకా                        
వేయించుకోవడమేనట 
ఒకవైపు జలప్రళయం
మరోవైపు కరోనా విలయతాండవం
కోవాగ్జిన్ టీకాతో
అడ్డుకట్ట వేయొచ్చునట
ముందున్నది పెనుముప్పు
కావాలిప్పుడు కనువిప్పు 
నిర్లక్ష్యం చేయకుండా
క్రమం తప్పకుండా                        
వ్యాయామం చెయ్యండి.
మానసిక ఒత్తిడి తగ్గుతుంది 
నిండు ప్రాణాలు పోకుండా
నీ రక్షణ నీకు రక్షణగా
టీకాలు వేసుకోండి !
అత్యంత పురాతనమైన
వాసికెక్కిన ఫంగస్ లు 
ఆధునిక మానవుని పై
పంజా విసురుతోంది
మానవుడి శరీరంలోకి
ఫంగస్ లు ప్రవేశించి
ప్రమాదకరమైన వ్యాధులకు
తలుపులు తీస్తోoదట
డెల్టా వేరియంట్ కరోనా వైరస్
దీనికి ప్రధాన కారణమట
మూడో దశ ఖాయమంటున్నారు
నిర్లక్ష్యం చేయకుండా
జాగ్రత్తలు తీసుకుంటేనే 
కరోనా మూడో ఉదృతిని
జయించవచ్చును, అందుకు 
జాతరలు,పండుగలు
విందులకు,వినోదాలకు
దూరంగా మసలు కోండి !
ప్రాణానికి ముప్పు తెచ్చుకోకండి !
*ఉందిలే మంచి కాలం*
*ముందు ముందునా*
*ఇది ఆనాటి మహాకవి*
*శ్రీశ్రీ మాట*
*ఉందిలే గడ్డుకాలం*
*ముందు ముందునా*
*ఇది ఈ నాటి మాట*
అందుకే మనం
అందరూ బాగుండాలంటే 
అందులో మనం ఉండాలంటే 
టీకా వేయించుకోండి! డోకా లేదు 
పరిశుభ్రత పాటించండి !
మాస్కు తప్పక ధరించండి !!
భౌతిక దూరం పాటించండి!!!
అప్రమత్తంగా ఉంటే మాత్రం
మహమ్మారి నీ వెంటనే ఉంది 
మీ ప్రాణాలకు ముప్పు తప్పదు
తస్మాన్ జాగ్రత్త......జాగ్రత్త......

కామెంట్‌లు