వేంకటేశ్వరుని స్తుతి:-మమత ఐల-కరీంనగర్9247593432

 ఉ.
కొండల రాయుడంట మరి కోరిక కోర్కెలుదీర్చువాడటన్
దండము బెట్టచాలునట తంతెల నెక్కుచు నేకధాటిగన్
గండము లన్నిబాపు నట కాదన నేరని వేంకటేశుడై
నిండుగ దీవెనిచ్చునట నిక్కము భక్తిగ కొల్చువారికిన్
ఉ.
బండల నుండి జారునట పాపవినాశనవాహినెప్పుడున్
గుండములోనమున్గ యొన గూరినపాపము లన్నిబాయగన్
దండిగవేంకటేశ్వరుని దర్శన భాగ్యము నొందుచుందురే
యండగ దైవముండి నభయంబును కూర్చగ చింతలేలనో!

కామెంట్‌లు