ప్రభాత సౌందర్య వర్ణన:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
భానుడుమెల్లగా నుదయ ప్రాంతము వేళల వచ్చుచుండగన్
భానుని సోయగంబును సువర్ణపు కాంతితొ పోల్చతక్కువే
కోనల మధ్యనుండి వెలుగొందెడి పొద్దును గాంచసుందరమ్
కాన ప్రభాత ధోరణి జగమ్మున మెచ్చని నాథుడుండడే
ఉ.
చక్కనిబింబమై వెలుగుచల్లని ప్రభాతవేలలందునన్
నిక్కము తూర్పుదిక్కురవి నేత్రము మెల్లగ విప్పినట్లుగన్
మక్కువతోడపెట్టెదరు మంగళమైనశుభోదయంబనిన్
పెక్కురు సూర్యవందనము వేకువజామున చేయుచుందురిలన్

కామెంట్‌లు