కాపాడాలి!:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9349611445

  ఒక చోట విరిగిన శిల్పం పడి ఉంటుంది.ఎవరూ పట్టించుకోరు!ఒకరి దగ్గర అరుదైన పుస్తకం శిధిలావస్తకు, చేరుకుంటుంది అయినా ఆ వ్యక్తో అతని సంతానమో దాని పట్టించుకోక పోవచ్చు!
       ఇంతమంది అధికారులు,మంత్రులు విదేశాలు తిరుగుతుంటారు,అక్కడ వారు ప్రతి కళాఖండాన్ని ఏవిధంగా కాపాడుతుంటారో చూస్తుంటారు.అయినా మనదేశానికి వచ్చాక మన కళాఖండాల్పి కాపాడుకోవాలనుకునే స్పృహలో వారుండరు.
       ఉదాహరణకు కర్నూలు జిల్లా బనగానిపల్లి దగ్గర
ఉన్న ఒక నవాబుల కోట పాడు పడతోంది.అయినా ఏప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఆ కోటని 'అరుంధతి' సినిమాలో ఉపయోగించుకున్నారు.
       మరికొన్నింటిని పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోవడంలేదు! ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్లో పురాతన దేవాలయం జీర్ణావస్థకు చేరుకుంటున్నది! దానిని మరింత కాపాడి కేవలం భక్తి పరంగానే కాకుండా,ఒక సందర్శనా స్థలంగా విశేష ప్రచారం చేయాలి.
        కేవలం శిల్పాలు,దేవాలయాలు,కోటలే కాకుండా మనదేశంలో చిత్రకారుల చిత్రాలు,చేతివృత్తుల కళాకారుల కళాఖండాల్ని కాపాడవలసిన అవసరం ఉన్నది.
         మహత్తర చిత్రకళాకారుడు వడ్డాది పాపయ్య చిత్రాలు కేవలం యువ,చందమామ వంటి పుస్తకాల్లో మాత్రమే చూస్తుంటాము.ఇప్పుడు ఆ పత్రికలే లేవు.అదే ఏ జర్మనీలోనో,అమెరికాలోనో అయితే ఆ మహామహుడికి ఒక పెద్ద మ్యూజియం పెట్టి ఉండేవారు. కనీసం ప్రభుత్వం లేక ఎవరైనా కళాఖండాల సేకరణకర్తలో ఆయన చిత్రించిన అసలు చిత్రాలు సేకరించి భావితరాలకు అందించాలి.అదే విధంగాకీ॥శే॥ బాపు,చంద్ర,మోహన్ మొదలైనవారివి సేకరించాలి.వాటిని కాల గర్భంలో కలసి పోకుండా కాపాడాలి.చందమామలో చిత్ర,ఎంటివి.ఆచార్య, శంకర్ లైన్ డ్రాయింగ్ బొమ్మలు నిజమైన కళాఖండాలు.అవి ఔత్సాహిక చిత్రకారులకు పాఠాలు!
      చాలామంది స్టాంపులు,నాణేలు,కరెన్సీ సేకరిస్తుంటారు.అవి వారి పెట్టెల్లో మగ్గి పోతుంటాయి.కనీసం వారు మంచి మనస్సుతో వారి సేకరణలు మంచి మ్యూజియానికి ఇస్తే వాటి చరిత్ర,దేశ చరిత్ర కూడాతెలుస్తుంది.
         నా స్నేహితుడొకరి దగ్గర అరుదైన పురాతన తాళం,తాళపత్ర గ్రంథం ఉన్నాయి,ఎవరైనా ఇంటికి వస్తే వాటిని చూపించి లోపల పెడుతుంటాడు.ఏదైనా మ్యూజియంకి ఇవ్వమంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు.
       ఇంతకు ముందు నేనొక వ్యాసంలో చెప్పినట్లు కార్టూన్లకు కూడా ఓ మ్యూజియం కావాలి లేకపోతే అధ్బుతమైన కార్టూన్లు కాలగర్భంలో కలసి పోతాయి.
       ఎవరైనా ప్రభుత్వాలను ఔత్సాహికులను కదిలించి ఈ కళాఖండాల్ని కాపాడాలి.
                 **************
 మీకు తెలుసా?
 మేఘాల్లోని మెరుపుల్లో 500కోట్ల జౌళ్ళకి(శక్తి యూనిట్) పైగా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
                 ***************
    
కామెంట్‌లు
Kalasagar చెప్పారు…
Very good suggestions.
Padma Artist చెప్పారు…
ఏ museum కైనా ఇస్తే బాగుంటుంది అని మీరన్నపుడు మీ స్నేహితుడు నవ్వడం సహజమైనదే. ఆ విలువైన వస్తువులు museum లో ఎలా ఉంటాయి, ఎన్నాళ్లుంటాయో చెప్పలేము కనుక. ఇవ్వలేము. మ్యూజియం కి ఇవ్వగలిగే
ధైర్యం విలువైన వస్తువులు భద్రపరచచే వారికి కలిగే కాలం రావాలని ఆశిస్తూ ఎదురు చూద్దాము.