గురువులు:-బెజుగాం శ్రీజ ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 1ఆ.వె.
పాఠశాలలోన ప్రథమ యాచార్యులు 
సౌమ్య గుణము గలిగి చదువు నేర్పు 
న్యాయమునకు పోరు నరసింహారెడ్డియు
మూర్తి వలన గొప్ప కీర్తి వచ్చు
2ఆ.వె.
లక్షణములు నేర్పు లక్ష్మయ్య సారిక
తెలుగు భాషబోధ వెలుగు నింపు
పాట,పద్యములను పరవశంబుగపాడు
బాలలారమీరు బడికిరండి 
3.ఆ.వె.
జీవ శాస్త్రమందు జీవజాతుల గూర్చి
చెప్పుచుండ మదికి చిత్రమౌను
రామిరెడ్డి సారు రమ్యత గొప్పది
శాంత మూర్తి తాను సకల మందు 
4ఆ.వె.
లలిత కళలయందు రాధిక మేడము
నాటపాటనేర్పు నద్భుతముగ 
నాటలాడదేహమారోగ్యముగనుండు
యుక్తిమిన్న పెరిగి శక్తి వచ్చు
5తే.గీ.
సాంఘికనుబోధజేయును శ్రద్ధతోడ
గురువు నర్సింహ్మ సారిల గొప్పగాను 
నవసమాజముగూర్చియు నమ్మకముగ 
తెలియజేసెను మాకెంతొ తేజమలర
6తే.గీ.
భౌతికనుబోధ జేసియు ప్రతిభ తోడ
చెప్పు చుండును పాఠాలు శీఘ్రముగను
మాత శోభరాణియెగొప్ప మనసు తోడ 
మమతనేపంచుసతతము మధురముగను
7తే.గీ.
ఆంగ్లభాషను బోధించి యందముగను
వీర భాస్కరు గారలు వెలుగు నింపు 
పాఠశాలలో నందరి బాగుకోరి
పేద విద్యార్థులకునెల్ల పెన్నిధయ్యె
8తే.గీ.
ఆ,ద్వితీయ భాషయె హింది యద్భుతముగ
శివ కుమార్ సారు పాఠాలు చెప్పుచుండు 
పిల్లలనిననుచక్కగా ప్రేమపంచి 
వెలుగులనునింపినాడిల గెలుపు పొంద
9తే.గీ.
గణిత మాస్టారు తిరుపతి కఠినమైన
లెక్కలన్నియు బోర్డుపై యక్కజముగ
సులభతరమునుజేసియు సూత్రములతొ
నేర్పుచుండును మా సారు ఓర్పుతోడ
10తే.గీ.
విజయ భాస్కరు ఫీజుల వివరములను 
టీసిలు,మెమోలు,నందించి
వాసిగాంచె
విద్య లెల్లను చదవండి పిల్లలార
యనుచు మార్గము చూపుమా కందరికిని.

కామెంట్‌లు