తాతయ్య కథలు-94.. ఎన్నవెళ్లి రాజమౌళి

 అమ్మ! ఒప్పి ఏం బాగా లేదు కదూ-అలా అనవద్దు. అందరూ చక్కగా అందంగా ఉండాలని లేదు. గుణం బాగుండాలి. మంచి విద్య పొందాలి. కానీ, రూపము ది ఏముంది. అన్నది శివ లీల.
చదువులో మాత్రం మా అందరి కంటే ముందే ఉంటుంది.
నేను అనలేదా. అందుకే కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు.
అంటే ఏమిటి అమ్మ. కాకి నల్లగా ఉంటుంది. కాకి పిల్ల నల్లగా ఉంటుంది. నల్లగా ఉంది తన పిల్ల అని-కాకి చేరదీయ దా. పిల్లలు కూడా అంతే. రూప వంతులు కానంత మాత్రాన వాళ్ళ పిల్లలను వాళ్లు ముద్దు చేసుకోరా! అయినా రూపము అన్నది ఎవరికి వారు పెట్టుకున్నది కాదు కదా.
ఇది కాక, పొట్టి వాళ్లను, నల్లగా వికారంగా ఉన్న వాళ్లను, అవిటి వాళ్లను ఇంకా ప్రేమ చేయాలి. మనం చేసే ప్రేమే వాళ్లకు కొండంత ధైర్యం అన్నది శివ లీల.
కామెంట్‌లు