జామ చెట్టు :-పెందోట వెంకటేశ్వర్లు9440524546

తెల్ల తెల్ల పువ్వులు
పచ్చ పచ్చ కాయలు
పసుపు రంగు పండ్లు 
జామ చెట్ల గొప్పలు

 రామచిలకలు వాలాయి
 కోతులు  ఎన్నో ఎక్కాయి
 పిల్లల గుంపులు చేరాయి
 కాయలు పండ్లు దొరికాయి

ఆడుతూ పాడుతూ పిల్లలు
మురుసుతు పండ్లు తిన్నారు
దోరకాయలు నాకంటూ 
అల్లరి ఎంతో చేశారు
కామెంట్‌లు