*కర్తవ్యం*పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట9440524546

వృద్ధి కైన అభివృద్ధి కైనా 
సంకల్పమే గొప్పదిరా 
పరిసరాలు తల్లిదండ్రులు 
కొంతవరకే తోడు రా 

పట్టుదలతో సాగితేనే 
పనులన్నీ వచ్చురా
ఫలితం మింత ఆశించక
కర్తవ్యము తో సాగు రా

జయాపజయాలు తలచుతూ
అక్కడే ఆగిపోతే ఎలారా
నీ లక్ష్యమె శ్వాస గా
అడుగులేస్తూ సాగరా
కామెంట్‌లు