"తెలుగు భాషాదినోత్సవం" :-కటుకం రాజయ్య: కలం పేరు:సంఘమిత్ర-చరవాణి సంఖ్య:9441560232
కం:గిడుగియు నడుగిడి నిచటను
     పడిలేవని పదములకును ప్రాణము బోసెన్
     నడుకను జనులది భాషకు
      కడు సొగసులు తీర్చిదిద్ది కాంతులు దెచ్చెన్!!

ఆవె:ప్రజల మాటలకును ప్రాణంబు బోసియు
      మాట పలుకు బడుల మనకు దెలిపె
     తెలుగు భాష సొగసు తెలియజేసెనుమెండు
     జనము భాష యెపుడు ఘనము భాష!!

సీ:వెలుగు వెలుగుచుండె తెలుగు భాషయునేడు
     తెలగాణ యాసలే తేజమిచ్చు
    అచ్చతెలుగునేడు నవనిలో మెండుగా
    పల్లెయందునజూడ పగరయుండు
    కవులగాయకులను కన్నట్టి యీనేల
    పుణ్యులు బుట్టిన పురిటి గడ్డ
     ప్రశ్నించె తత్వము ప్రగతిని గోరేటి
     విప్లవం బుట్టిన వీరభూమి!!

తేగీ:తెలుగు నేలను తలచిన కలుగు మేలు
       గడ్డి పరకలు గర్జించు గళములెత్తి
        ఎర్ర చీమలు నెదురేగు నెదురు నిలిచి
   ‌    పోరునేర్పిన యీభూమి  పొందె జయము!!


కామెంట్‌లు