గాలిపటం:-రావిపల్లి వాసుదేవరావుపార్వతీ పురం--9441713136
గాలిపటం గాలిపటం
గాలిలోన గాలిపటం
ఎగరేద్దాం రారండి
బిరబిరా కదలిరండి

ఆకాశం అంచులనూ
తాకింది గాలిపటం
నింగిలోని మబ్బులను
ముద్దాడెను గాలిపటం

గాలితోని పోటీగా
కదిలిందీ గాలిపటం
ఊయలలా అటుఇటూ
ఊగిందీ గాలిపటం

వెన్నెలలో జాబిలిగా
వెలిగిందీ గాలిపటం
చుక్కల్లో తానొకటై
నిలిచిందీ గాలిపటం

సంక్రాంతి పండుగకు
ఎగిరింది గాలిపటం
మనసుల్లో ఆనందం
నింపిందీ గాలిపటం


కామెంట్‌లు