మహాకవి దాశరథిబి ఒకసారి గుర్హు చేసుకొందాం...:- -డా. చిటికెన కిరణ్ కుమార్,సభ్యులు, ఇంటర్నేషనల్ బేనోవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సెల్. 9490841284 రాజన్న సిరిసిల్ల


 ఆ చల్లని సముద్ర గర్భం....
----------------------

     *నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ చాటిన మహాకవి దాశరథి నిజాంకు వ్యతిరేకంగా  తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతం చేసిన కలం యోధుడు తన రచనలతో తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న మహనీయుడు దాశరథి.* 

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

 *ఆ మహనీయుని జీవితం ఈ ప్రపంచానికి దిక్సూచి.* 
దాశరతి వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ] హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

 *తన రచనలతో తెలంగాణ ప్రజలను మేల్కొల్పడం...* 
 ముఖ్యంగా ఈ పాట ఎందరో మంది హృదయాలను గెలుచుకున్న ది.
 *ఆ చల్లని సముద్ర గర్భం* 
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని||

----------------------

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
 నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నది.1987 నవంబరు 5 న దాశరథి మరణించాడు.
రచనల్లో  "యాత్రాస్మృతి" కవితా సంపుటాలు.అగ్నిధార,మహాంధ్రోదయం,రుద్రవీణ,మార్పు నా తీర్పు,ఆలోచనాలోచనాలు,ధ్వజమెత్తిన ప్రజలు ,తిమిరంతో సమరం,నేత్ర పర్వం,పునర్ణవం,గాలిబ్ గీతాలు ఎంతో పేరు తెచ్చాయి.
 అందుకున్న ప్రతిష్ఠాత్మక  అవార్డులు.
----------------------
1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి,1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి,ఆంధ్ర విశ్వవిద్యాలయం " కళాప్రపూర్ణ ,వెంకటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "
----------------------
      నేటి కాలంలో సాహితీవేత్తలు, విద్వాంసులు చెప్పే ప్రధానమైన విషయాలలో మనం గమనించినట్లయితే సాహితీ పఠనం,  పుస్తక పఠనం లోతుగా అవపోసన చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు సంపాదించవచ్చు.. ఏది ఏమైనప్పటికీ సాహితీ మార్గమే దిశా నిర్దేశం అని చెప్పవచ్చు. రేపటి భవితకు మార్గనిర్దేశకత్వం అవుతుందని భావించవచ్చు.
         
సృష్టిలోని ప్రతి అందాన్ని అతి దగ్గరనుండి చూసే వ్యక్తి ఒక రచయిత మాత్రమే...
        ప్రకృతిలోని ప్రతి అందాన్ని విపులీకరించి చూసే కోణానికి ఓ కొత్త మార్గంలో అందజేసే మార్గదర్శి రచయిత...
బంధాలు, అనుబంధాలు మానవ సమాజం లో ఉన్నటువంటి అసమానతలను, మానవ విలువలను విశ్లేషణాత్మకంగా సమాజానికి అందజేసే వ్యక్తి రచయిత మాత్రమే...
భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తన కలం నుంచి దిశా మార్గదర్శకాలను చూపించే ఒక అద్భుతమైనటువంటి వారధి రచయిత అని చెప్పవచ్చు...
ప్రతి మనిషిలో నిగూఢమై ఉన్న శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మన్యూనత తో కుంగి  పోతున్నటువంటి మనిషిని తేజోవంతం చేయటంలో రచనలు మనిషి జీవితంలో ఎంతో దోహదపడతాయి.
ఈ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగిన, చెరగని ముద్ర మనుషుల్లో సంపాదించుకున్న ప్రతి వ్యక్తిని గమనించినట్లయితే దాదాపుగా పుస్తక పఠణం వారిలో నిగూడ  మైనటువంటి ఆస్తి అని చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా నాటి రాజరిక పాలన లో కానివ్వండి నేటి ప్రజాస్వామ్యంలో కానివ్వండి గమనించినట్లయితే వారు అనుసరించిన  ఆయుధం ఒక్కటే అదే పుస్తక పఠనం.


 

కామెంట్‌లు