గుర్రాల ముత్యాల హారాలు:-గుర్రాల లక్ష్మారెడ్డి., కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

171) మాటలాడు బొమ్మలు
        ఆటలాడు బొమ్మలు
        పాట పాడు బొమ్మలు
        వేట ఆడు బొమ్మలు !

172) మన్ని కైన బొమ్మలు
       ఎన్నికైన బొమ్మలు
      మిన్నయైన బొమ్మలు
        మా కన్నయ్య బొమ్మలు !

173) కుందనాల బొమ్మ లు
         చందనాల బొమ్మలు
         వందనాల బొమ్మలు
         మిత్ర వంద బొమ్మలు !

174) రంగురంగుల బొమ్మలు
          హంగు పొంగు బొమ్మలు
          మాఫిరంగుల బొమ్మలు
           సై సరంగుల బొమ్మలు !

175) చిట్టి పొట్టి బొమ్మలు
         లొట్టి పిట్ట బొమ్మలు
          అమ్మ కుట్టి బొమ్మలు
          జిమ్ము ఆడు బొమ్మలు !

176) ప్రాణం ఉన్న బొమ్మలు
       నిస్త్రాణం లేని బొమ్మలు
       ప్రస్తావించు బొమ్మలు
       మా ప్రస్తానం బొమ్మలు !

177) శివ మూగే బొమ్మలు
         శివ చిత్తుల బొమ్మ లు
         చిత్తు బొత్తు బొమ్మలు
          పూల గుత్తి బొమ్మలు !

178) పసిడి రంగు బొమ్మలు
        పసిడి పంట బొమ్మలు
        మా బోనము ల బొమ్మలు
        బాణములు వేయి బొమ్మలు !

179) పెళ్లిరోజు పెళ్లిరోజు
         మేము తుళ్ళిపడే రోజు
         మరుపు రానిది పెళ్లి రోజు
         మా ప్రియమైన పెళ్ళిరోజు !

180) మా చైతన్య గాజులు
          మహా నైపుణ్యం గాజులు
          సింగారం గల గాజులు
          బంగారం గల గాజులు

181) రంగు రంగు గాజులు
         హంగు పొంగు గాజులు
         తళుకు బెళుకు గాజులు
        మా కులుకుల గాజులు !

182) అందాలు చిందు గాజులు
         బంధాలు పొందు గాజులు
         చెక్కుచెదరని గాజులు
          మొక్కవోని మా గాజులు !

183) సౌభాగ్యం గాజులు
        వైరాగ్యం లేని గాజులు
        మా భవితవ్యం గాజులు
        నవ చైతన్యం గాజులు !

184) కిసానులం జవానులం
         భారతీయ  కిసానులం
         హారతీయు జవానులం
         చరితచాటు కిసానులం

185) చిట్టిపొట్టి చిరుతలం 
         గట్టి పట్టు బుడతలం
         తెలుగు తల్లి పిల్లలం
         వెలుగుతున్న మల్లెలం !

186) మచ్చ లేని ముత్యాలం
         స్వచ్ఛమైన రత్నాలం
        మేం మెరిసే పగడాలం
        చేస్తాం మాయాజాలం !

187) ఆది దంపతుల జంట
         చూడముచ్చట మనకంట
         చేయాలి పూజ అంట
          ఇంక ఎందుకు లేటంట !

188) రామకోటి రాస్తున్నా
         నే పూజలు చేస్తున్నా
         పేజీలు తిప్పే స్తున్న
         దీవెనలను ఆశిస్తున్న !


189) ఆకు కూరలను తిను
         త్రాగు ఆవుపాలను
         ఆరోగ్యానికి మేలను
          పెంచు ఇక ఆవులను !

190) అమ్మ మన తొలి గురువు
         నాన్న కాపాడు పరువు
          గురువు మన ఆదెరువు
           ఇక  నీకన్ను తెరువు !

191) నిమ్మ పులుసు పుల్లన
         తెల్లవారే బళ్ళున
           పాలేమొ తెల్లన
           తాగి చూడు మెల్లెన !

192) ఆకులన్ని  పచ్చన.  
         పసరు పోసి గిచ్చన
         ఎక్కి చూడు నిచ్చెన
         గొంగడేమొ వెచ్చన  !

193) నిమ్మ పండు పుల్లన
         తెంపవోయి మెల్లన
          నేరేడు పండు నల్లన
          విభూది పండు తెల్లన !

194) మంచి మనసు పెంచుకో
         ఆస్తి నీవు పంచుకో
          మంచితనం ఎంచుకో
          జాగ్రత్తగ ఉంచుకో. !

195) సహనం లేని జీవితము
        కాదులే ప్రభావితము
        బతుకు ఒక చదరంగము
         మెతుకు ఒక వరి వంగడము 

196) అన్నము రాశి పోయుము
         చుట్టు గీతను గీయుము
          అన్నదానము చేయుము
          వచ్చిన పేరును మోయుము

197) నీవు సత్యాలనే చెప్పు
        వాటి గుట్టును విప్పు
        అసత్యాలు చెప్పుట తప్పు
         అవి కలిగిస్తాయి ముప్పు !

198) మంచి మిత్రుల స్నేహం
         వంచన లేని స్నేహం
         స్త్రీపురుషుల స్నేహం
          అజరామర స్నేహం !

199) మనల కన్నది అమ్మ
        మనల పెంచిన బతుకమ్మ
        పాలు ఇచ్చి పెంచునమ్మ
       మనసున్న మమతల కొమ్మ !

200) అమ్మ అపూర్వ దేవత
        చూస్తుంది లే మన భవిత
         ఆమెపై వ్రాస్త కవిత
         ఆమె పేరు నవనీత  !

కామెంట్‌లు