గుర్రాల ముత్యాల హారాలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా
 271) పిల్లి పాలు తాగుతుంది
        మ్యావ్ మ్యావ్ అంటుంది
       అది వస్తున్నట్టుంది
      చేయరా దానిని బంది !
272) ఎక్కడివి ఈ అటుకులు
       వే స్తున్నావు గుటకలు
       తొక్కకు పచ్చి ఇటుకలు
       ఆడ ఉన్నవి  పలకలు !
273) దుమ్ము లేస్తుంది చూడు
       దమ్ముంటే లేచి చూడు
       ఈలవేసి చెప్పు గోడు
        తప్పుకుంటా డు వాడు !
274) కాలం కానీ కాలం
       ఇది కరోనాకాలం
       దాని కుందిలే బలం
      అయినా వేయి గాలం !
275) మనసు పెట్టి చదువు
         నచ్చిందా కథ వధువు
         నచ్చితే ఇక  విడవవు
         గడగడ చదువుతావు!
276) అత్త ఒకఇంటి కోడలు
       పడుతుంది గాలిమేడలు
        తిరుగును వాడ వాడలు
        ఔలే బండ్లు ఓడలు !
277) కొమ్మ మీద కోయిల
       పాడుతుంది సన్నాయిల
       వచ్చిపోయే తోవల
        ఫలించేను నాకెలా !
278) పుట్ట లో ఉన్నవి చీమలు
        గట్టున ఉన్నవి పాములు
        చెట్టు కింద సాములు
        అంతట ఉన్నవి దోమలు !
279) గోడకు వేయి సున్నం
        జేబుకు వేయకు కన్నం
         అను సామెతలవిన్నం
         మేము ఇవి కనుగొన్నం !
280) కత్తితో కొరుగు నెత్తి
         వెలిగించు మైనం బత్తి
          పత్తితో చేయి వత్తి 
           గోవిందా  నీనత్తి. !
281 నల్ల వస్త్రం కట్టకు
      వద్దన్నానని గులగకు
      సద్దన్నం అని అలగకు
      నా ముందర నిలువకు !
282) ముత్యాల్లాంటిమా పళ్ళు
         నిత్యం నీవు గుడికి వెళ్ళు
         పుణ్యం ఇచ్చును ఈ గుళ్ళు
        తొలగిపోవునులే కుళ్ళు !
283) చేపట్టు కథల కూర్పు
        నీకు ఉంది ఆ నేర్పు
        వహించు నీవు ఓర్పు
        వచ్చులే ఇక మార్పు !
284) తెలుగు భాష మధురం
         అదిరిందిగా ఆధరం
          మేము ఎవరికి బెదరం
           తెలుగు సదనం సుందరం !
285) మీసాలు తిప్పు రా
        కథలు ఇక చెప్పకురా
        పొడుపు కథలు చెప్పురా
         విప్ప కుంటే తప్పురా !
286) విను ఆ గాజుల గలగల
         మెరుస్తున్నవి మిలమిల
          ఎందుకు నీకు గుల గుల
          తీరుతుందిలే మా కల !
287) వలతో చేపలు పట్టు
         రాయిపై ఎండబెట్టు
          మొప్పలను విడగొట్టు
         సాగదీసి కొట్టు కొట్టు !
288) అందుకో ఆపిల్ పండు
        అదిగో తలకింద దిండు
         వాటిని తీసుక రండు
         అంతా సవ్యంగా ఉండు !
289) శ్రీరాముని ధ్యానించు
         ఆయన వేషం ధరించు
         వాలిని నీవు వదిలించు
         బాణమును సంధించు !
290) చిన్న చిన్న పిల్లలు
         వెన్న తిన్న మల్లెలు
         మెరిసేటి కిరణాలు
        మెరిసేటి తోరణాలు !
291) బుల్లి బుల్లి పిల్లలు
         అల్లుకొన్న మల్లెలు
        చిగురించేటి లతలు
        చెప్పుతారు వారు కథలు !
292) కన్నవారి ఆశలు
        వారు చేయు బాసలు
        మరువరు మాతా పితలు
       ఇక ఉండవు లే వెతలు !
293) కన్నవారికోరికలు
        తళతళలాడు అలలు
         తల్లిదండ్రుల పిల్లలు
        పూలబాస మల్లెలు !
294) రాలుగాయి పిల్లలు
        రేగుతున్న మల్లెలు
        వాగుతున్న మొల్లలు
         జోగుతున్న తల్లులు !
295)) కలువపూల పిల్లలు
         ఆ చంద్రుని మల్లెలు
         మెరిసే హరివిల్లు లు
         కురిసే విరిజల్లు లు !
296) కన్నవారి సౌధములు
       పుడమితల్లి పునాదులు
        కారు వారు అనాధలు
        సదా మనకు విధేయులు !
297) పూలలో మకరందం
        ఆకు ఆకులో అందం
        కనిపిస్తున్న చందం
         పూల రాగం విందం !
298) గణేశుని నమ్ముకున్నం
        గుంజీలను తీస్తున్నం
        పూజలను చేస్తున్నం
        క్షేమంగానే ఉన్నం !
299) శ్రీ సుధాకర ధరా
        అర్ధనారీశ్వరా
        ఓ త్రిశూలా ధరా
       ఈ దీనుని కావరా !
300) విడువక నిన్ను పూజింతు
         నిన్నే నే ఆరాధింతు
        నిత్యం నడిచే ఈ తంతు
         హారతితో ముగింతు !


కామెంట్‌లు