గుర్రాల ముత్యాల హారాలు.:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
541) అలుగెళ్ళిందిగా చెరువు
        అలలు వేసెను దరువు
         అంతరించే కరువు
          చిగురించేను తరువు !

542) అమ్మలను మెప్పించారు
          తమ్ముల దూషించారు
          సుతుల పోషించారు
         గతులను తప్పించారు !

543) అమృతమును త్రాగావా
        జీవించే ఉన్నావుగా
         చెప్పింది చేసావుగా
        అయ్యావు చిరంజీవిగా !

544) అల్లము తీసుకొనిరా
          నూనెను పోసుకొనిరా
          వానిధర రాసుకునిరా
           ధరల జాబితా తేరా !

545) అలుపు సొలుపు లేదు
          గెలుపు గుర్తుకు రాలేదు
          గెలిచిన వారు రాలేదు
          బహుమతులనూ తేలేదు !

546) అత్తా దుత్త ఏడ ఉంది ?
         పై మేడపైనే ఉంది
         సరిగా చూడు ఉంటుంది
         కనిపిస్త లేదంటుంది !

546) అన్నము సున్నము ఆయెను
         కన్నయ్య పారిపోయెను
         ఈ వెన్నను ఏడ దయను
         మూతలు ఎలా మూయను !

547 )అందలం నీవు ఎక్కు
        పరద వెనుక ఇక నక్కు
        ఎక్కడుంది ఆ చిక్కు
         చెప్పమ్మా ఓ సక్కు !

548) అసలు నిజం తెలుసుకో
        వెళ్ళి నీవు కలుసుకో
         మనిషివై మసలుకో
          చెడును నీవు వదులుకో !

549) మెడలో తాళి  వేసుకో
        పైకి పసుపును పూసుకో
        మెట్టెలనూ వేసుకో
         అద్దంలో నువు చూసుకో !

550) ఆశలు అడియాసలు
         కోరికలేమో గుర్రాలు
          తెగనుగా స్వరాలు
          ఏమా పూర్వ పరాలు !

551) అందం చెక్కు చెదిరింది
         బంధం ఇక కుదిరింది
         నా ప్రాప్తం  అనుకుంది
         చెబితే తాను వినకుంది !

552) అగ్గిమీద గుగ్గిలం
         కప్పుకునే రగ్గులం
          పడుతున్న సిగ్గులం
           తాగేసిన పెగ్గులం !

553) రంగు పడుద్ది కదలకు
         అంతవరకు వదలకు
         ప్రయత్నించు పదవులకు
          తుడుపు నీవు పెదవులకు 

554) ముసలకం ఉంది ముందర
         పడకు నీవు ఇక తొందర
         పెట్టకూడదు ఉదర
          తెలిసిందా యశోధర !

555) పాడుతున్నడు పాటను
          చెబుతున్నడు మాటను
           సాగిస్తున్నాడు వేటను
           మోస్తున్నాడు మూటను !

556) జాతర సాగుతుంది
        జనం ఘోష రేగుతుంది
        దుమ్ము కూడా లేస్తుంది
         అంతా గమ్మత్తుగుంది !

557) పొయ్యి మీద పెనం ఉంది
         పరాట చేయమంది
         పింకి తాను తిననంది
         తాను అలిగి కూర్చుంది !

558) కారొస్తుంది నువు జరుగు
         వాడు పుస్తకాల పురుగు
         ఆ చేటతోని చెరుగు
        చరగక తీశాడు పరుగు !

559) రంగడు రాము మిత్రులు
         కారు వారు శత్రువులు
         వారు ఆమని పుత్రులు
         ఐరి క్షతగాత్రులు !

560) అది ఒక దుష్ట శక్తి
     అది పన్నింది కుయుక్తి
     దానికి లేదుగా భక్తి
      ఇంకెలా వస్తుంది ముక్తి !

561) ఇంటి కప్పు కూలింది
         బాంబు కూడా పేలింది
          పక్షి పైన వాలింది
           రెక్కలూడి పడింది  !

562) సున్నిపిండి తీసుకురా
        మొగలిరేకు తీసుకురా
         భద్రంగా పెట్టుకొనిరా
          నిద్రాణంగ ఉండదురా !

563) తేనె నీళ్లు కలుపు
         ఎవరిదిరా ఆ పిలుపు
          ఆ వైపు దృష్టి నిలుపు
          అసలు సంగతి తెలుపు !

564)కృష్ణతులసి వచ్చింది
       సత్య ఆమెను మెచ్చింది
        స్వామి మురళిని తెచ్చింది
         ఆమె చేతికి ఇచ్చింది !

565) బంగారు గొలుసు మాయం
         ఆమె మనసుకు గాయం
          ఎవరు చేస్తారు సాయం
          అంతా ఇక అయోమయం !

566) రమ్య ఇలా రావమ్మ
          గమ్యం ఇదేనానమ్మ
           మరిచిపోకు నీవమ్మ
           మా బంగారు బొమ్మ !

567) అలా సున్నాలు చుట్టొద్దు
         పలక పక్కకు పెట్టొద్దు
         రాస్తేనే నువు ముద్దు
          ఒరేయ్ శుద్ద మొద్దు !

568) చింత నీకు వద్దురా
         కలత పడవద్దురా
          నా స్వామి ఇక రారా
          మురిసింది మనసేరా !

569) సబ్బు పెట్టి ఉతుకురా
        దుస్తులు శుభ్రం చేయరా
       ఆపై ఇస్త్రి చేయరా
         ఇక వేసుకొని తిరగరా !

  570) గోకుల కృష్ణ రారా
           బృందగానం చేయరా
           వరమును నీవు ఇయ్యరా
           మమ్ముల నీవు బ్రోవరా  !

571) తిరుపతి కొండ ఎక్కాము
         ఆ స్వామికి మోక్కాము
          భక్తులకు చిక్కాము మేము
           వారితో చేస్తాం సాము !

572)చెట్టుపైన వానరం
        పుట్టపైన పావురం
        సిగలోఉంది సవరం
       పూల పైన భ్రమరం !

573) పాప ముద్దుగా ఉన్నాడు
         ఉగ్గు బువ్వ తిన్నాడు
         రగ్గు తా కప్పుకున్నాడు
         నిదుర తాను పోతున్నాడు !

574) బుగ్గలు మెరుస్తున్నవి
        సిగ్గులు పరుస్తున్నవి
       సొట్టలు పడుతున్నవి
        నిగ నిగ లాడుతున్నవి !

575) పదనిస పాటలు పాడు
        సరిగమలను నీవు వాడు
        ఎవరొచ్చారు నీకు తోడు
         అతనే నీకు సరిజోడు  !


కామెంట్‌లు